గోమాతను చూడగానే తినడానికి ఏదైనా పెట్టి ఎంతో భక్తితో పూజించే సాంప్రదాయం మనది. అలాగే ఎక్కడైనా కనిపించినప్పుడు గోవును నిమురుతూ మనసులో ఏదైనా అనుకుంటే అవి నెరవేరుతాయని ఆస్తికుల నమ్మకం. అయితే ఆవు తోకలోని ఒక వెంట్రుకను తీసి మీ కాలి బొటన వేలు కి కట్టి మీ ఒంట్లో ఏదైనా నొప్పి ఉన్నచోట ఆ బొటన వేలితో తొక్కుతూ ఉండడం వలన ఆ నొప్పి తగ్గుతుందని చాలా మంది గాఢంగా విశ్వసిస్తారు. కొందరు స్వామీజీలు, ఆధ్యాత్మిక పండితుల కరవాలం(చేతి)లో తాడు లేదా విసనకర్ర కు తెల్లటి దారాలు లాంటి వస్తువులు ఉంటాయి. ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చినప్పుడు వాటితో వెన్నుపై తట్టి మరీ ఆశీర్వదిస్తారు. అయితే ఆ ఈకలు ఏమిటో చాలా మంది పరిశీలనాత్మకంగా చూసి ఉండరు.
ఆ వస్తువుల్లో గోవుతోకలోని వెంట్రుకలు ఉండడం వల్ల వాటిలోని మహత్తరమైన ఎనర్జీ.. ఆశీర్వాదం తీసుకున్న వారిలోకి ప్రవేశిస్తుందట. ఆప్పుడు ఆ మనిషిలోని సమస్యలు తొలగిపోతాయట. ఇంట్లో ఎవరికయినా దిష్టి తగిలితే గోవుతోకలోని వెంట్రుకనీ, కొంచెం కుంకుమను కాగితంలో చుట్టి దాన్ని ఒక ఖాళీ తావీజు లో పెట్టుకుని కట్టి మెడలో వేసుకోవడం వలన ఎప్పటికీ జీవితంలో దిష్ఠి అనేదే తగలదట. ఇక గోపూజ విషయానికి వస్తే..
అసలు గోపూజ అనేది ఒక సామాజిక అవసరాన్ని బట్టి ఒక ఆచారంగా పుట్టిందనిపిస్తుంది. ఎందుకంటే వ్యవసాయం ప్రధాన వృత్తి అయిన మన సమాజంలో గోవుకు ఎంతగానో విశిష్టత ఉంది. అందుకే గోకులాస్టమి , గోవత్స ద్వాదశి (ఆశ్వయుజ బఖుళ ద్వాదశి నాడు), కార్తీక మాస పూజలు కార్తీక శుద్ద పాఢ్యమి నుండి బహుళ అమావాస్య వరకు జరుపుతారు. వీటిలో భాగంగా గోపూజలు చేస్తారు. అసలు చెప్పాలంటే ఆవును ప్రతిరోజూ పూజింపమని మన పూర్వీకులు మాట. నిత్య జీవితానికి ఉపయోగపడే గోవును పూజించమనో, రక్షించమనో చెబితే పట్టించుకోరని దేవుడి పేరిట పుణ్యాల ఆశ చూపారని బ్రహ్మర్షి చాగంటి కోటేశ్వరరావు మాట. ఇక..
మన ఆధ్యాత్మిక శాస్త్రాల్లో కనిపించే గోవు పటాన్ని గమనించినట్లైతే అందులో గోవు తోక భాగంలో లక్ష్మీదేవి ఉన్నట్టు చూడవచ్చు. అందువల్లనే ఇప్పుడు కూడా చాలా మంది గోవు తోకను స్పర్శించి ప్రార్థిస్తుంటారు. గోవు పాదాల నుంచి కొమ్ముల వరకు దేవతలు, త్రిమూర్తులు కొలువుండటం వలన గోవును దేవతగా భావించి పూజలు చేస్తుంటారు. విజ్ఞాన పరంగా చూసినట్లైతే గోవు పంచితం క్రిమి సంహారిగాను (రసాయ పదార్థం) ఉపయోపడుతుందట. అంతేకాకుండా గోవు ఇచ్చే పాలు తల్లి పాలతో సమానంగా శ్రేష్టమయినవట. అలాగే..
దేవ రహస్యాన్ని కనుగొనే మహత్మ్యం గోవుకు మాత్రమే ఉంటుందని శాస్త్రాలు చెపుతున్నాయి. అందుకే‘గోపూజ’కి మన పురాణాల్లో ఎంతో విశిష్టత ఉంది. గోక్షీరం (ఆవుపాలు)లో చతుస్సముద్రాలుంటాయట. సర్వాంగాలలో సమస్త భువనాలు దాగి ఉం టాయి. ఆవు నుదిటి భాగంలో శివుడు, కొమ్ముల చివరలో మూడుకోట్ల యాభైలక్షల తీర్థాలు వుంటాయట. వాటిపై చల్లిన నీటిని సేవిస్తే… త్రివేణి సంగమంలోని నీటిని శిరస్సు పై చల్లుకున్నంత ఫలితం లభిస్తుంది. నుదుట న శివుడు ఉంటాడట.. కనుక అక్కడ శివ అష్టోత్తరం, సహస్రనామాలు పఠిస్తూ… బిళ్వ దళాల తో పూజిస్తే… సాక్ష్యాత్తు కాశీ విశ్వేశ్వరుణ్ణి పూజించిన ఫలితం దక్కుతుందట. గోవు నాసికలో సుబ్రహ్మణ్యస్వామి వుండటం అక్కడ పూజిస్తే సంతాన నష్టం ఉండదట. ఆవు చెవివద్ద అశ్వినీ దేవతలు కొలువై ఉం టారట. వారిని స్వర్గలోక వైద్యులు అంటారట. అందువల్ల ఆవు చెవిని పూజిస్తే… సమస్త రోగాల నుండి విముక్తి అవుతుందంటారు. ఆవు కన్నుల దగ్గర సూర్య, చంద్రులు ఉంటారు. వారిని పూజిస్తే… అజ్ఙానమనే చీకటి నశించి జ్ఞానకాంతి, సకల సంపదలు కలుగుతాయట. ఆవు నాలికపై వరుణ దేవుడు వుండటం వల్ల అక్కడ పూజిస్తే శీఘ్ర సంతతి ప్రాప్తిస్తుందట. ఇక..
ఆవు సంకరంలో ఉన్న సరస్వతీదేవిని పూజిస్తే విద్యాప్రాప్తి.. ఆవు చెక్కిళ్ళలో కుడి వైపున యముడు, ఎడమవైపున ధర్మదేవతలుంటారట. కనుక వాటిని పూజిస్తే యమబాధలుండవట. పుణ్యలోకప్రాప్తి లభిస్తుందట. ఆవు పెదవుల్లో ప్రాతః సంధ్యాది దేవతలుంటారట. వాటిని పూజిస్తే పాపాలు నశిస్తాయట. ఆవు కంఠంలో ఉండే ఇంద్రుడిని పూజిస్తే. ఇంద్రియ పాటవాలు, సంతానం కలుగుతుందట. ఆవు పొదుగులో నాలుగు పురుషార్థాలు ఉంటాయి. కనుక ఆ చోట పూజిస్తే ధర్మార్థ, కామమోక్షాలు కలుగు తాయట. ఆవు గిట్టల చివర ‘నాగదేవతలు’ ఉంటారు. వాటిని పూజిస్తే నాగలోక ప్రాప్తి లభిస్తుందట. అంతేకాక భూమిపై నాగుపాముల భయం ఉండదట. ఆవు గిట్టల్లో గంధర్వులుంటారట. అందుకే గిట్టలను పూజిస్తే గంధర్వలోక ప్రాప్తి కలుగుతుందట. గిట్టల ప్రక్కన అప్సరసలుంటారట. ఆ భాగాన్ని పూజిస్తే సఖ్యత, సౌందర్యం లభిస్తాయట.