A story of lord shiva devotee: వేశ్య వల్ల కాశీకి వెళ్లలేకపోయాడు.. స్త్రీ వ‌క్షోజాల‌నే లింగంగా భావించి అత‌ను పూజ చేశాడు.! చివరికి ఏమైంది?

A story of lord shiva devotee: మ‌న దేశంలో ఉన్న అనేక చారిత్రాత్మక ఆల‌యాల‌కు ఒక్కోదానికి ఒక స్థల పురాణం ఉంటుంది. ఆయా ఆల‌యాల్లో దేవుళ్లు, దేవ‌త‌లు కొలువు దీర‌డం వెనుక ఆశ్చ‌ర్య‌క‌ర‌మైన క‌థ ఉంటుంది. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా అలాంటి ఓ ఆశ్చ‌ర్య‌మైన క‌థే. మ‌రి ఆ క‌థ ఏ ఆల‌యానికి చెందిన‌దో తెలుసా..? అది ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలోని ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో ఉన్న ఆచంట‌లోని రామేశ్వ‌ర స్వామి ఆల‌యం. ఇప్పుడు మేం చెప్ప‌బోయేది కూడా ఈ ఆల‌యానికి చెందిన స్థ‌ల పురాణం గురించే. మ‌రింకెందుకాల‌స్యం.. అదేమిటో ఇప్పుడు తెలుసుకుందామా..!

అది తారకాసుర సంహారం జరిగిన స‌మ‌యం. అప్పుడు ఒకానొక సంద‌ర్భంలో శివపార్వతులు ఇద్దరూ శృంగారంలో ఉంటారు. ఆ సమయంలో ముని దంపతులైన పుష్పసుందరుడు, పుష్పసుందరి శివుడి దర్శనం కోసం ఆయ‌న ఉన్న ప్రదేశానికి వస్తారు. ఈ క్ర‌మంలో శివపార్వతులిద్దరూ శృంగారంలో ఉండ‌డాన్ని వారిద్ద‌రు దంప‌తులు చూస్తారు. ఇది గ‌మ‌నించిన‌ శివుడికి కోపం వస్తుంది. వెంటనే ఆ ముని దంపతులకు శివుడు శాపం పెడ‌తాడు. మీరిద్దరూ మళ్లీ బ్రహ్మచర్యాన్ని పాటించి, తర్వాత శివసాయుజ్యాన్ని పొందండి అంటూ శివుడు శ‌పిస్తాడు. దీంతో శాపగ్రస్తులయిన ఆ ముని దంపతులలో పురుషుడైన పుష్పసుందరుడు భూలోకంలో బ్రాహ్మణ ఇంట ఒడయనంబిగా జన్మిస్తాడు. ఇక‌ పుష్పసుందరుడి భార్య పుష్పసుందరి మార్తాండపురంలో కళావంతుల ఇంట పరమనాచిగా పుడుతుంది. అయితే ఆమె వేశ్య‌గా మారుతుంది.

5 6

కాగా ఒక స‌మ‌యంలో కాశీవిశ్వనాధుని సన్నిధిలో మహాశివరాత్రి ఉపవాస జాగరణ, పూజలు నిర్వహించడానికి కాశీ నగరానికి బయలు దేరుతాడు ఒడయనంబి. వెళ్తూవెళ్తూ అలిసిపోయిన అతను మార్గ‌మ‌ధ్య‌లో ఒక గ్రామంలో విశ్రాంతి తీసుకుందామనుకుంటాడు. ఆ క్ర‌మంలో ఒడ‌య‌నంబికి ఒక వేశ్య ఇంటిలో ఆశ్ర‌యం ల‌భిస్తుంది. అయితే ఒడయనంబికి ఆ వేశ్య గ‌త జ‌న్మ‌లో త‌న భార్య పుష్ప సుంద‌రి అని తెలియ‌దు. కానీ వేశ్య‌గా ఉన్న ఆమె అందానికి ఒడ‌య‌నంబి ముగ్ధుడ‌వుతాడు. దీంతో అన్ని విషయాలు మరిచిపోయి ఆ వేశ్యతో సుఖాల‌ను అనుభ‌విస్తాడు. అయితే ఒక రోజు రాత్రి ఆ ఊరి దేవాలయం నుంచి శివపంచాక్షరీ జపం వినబ‌డుతుంది. దాంతో ఒడయనంబికి తాను అస‌లు ఎందుకు అక్క‌డికి వ‌చ్చింది, ఎక్క‌డికి వెళ్లాలి, ఏం చేయాలి అనే ప‌నులు గుర్తుకు వ‌స్తాయి.

A story of lord shiva devotee:

A story of lord shiva devotee:

ఇక అలా గుర్తుకు వ‌చ్చే సరికి ఒడ‌య‌నంబికి ఏం చేయాలో అర్థం కాదు. మ‌రోవైపు అదే రోజు మ‌హాశివ‌రాత్రి కావ‌డంతో కాశీకి ఇక చేరుకోలేన‌ని భావించి మ‌న‌స్సులో తీవ్రంగా కుంగిపోతాడు. వేశ్య వ‌ల‌లో చిక్కుకుని కాశీకి వెళ్ల‌కుండా అయినందుకు త‌నను తానే నిందించుకుంటాడు. అయినా చింతించ‌కుండా ఆ వేశ్య ఇంట్లో శివ‌లింగం ఏదైనా క‌నిపిస్తుందేమోన‌ని వెతుకుతాడు. ఆ భాగ్యం కూడా అత‌నికి క‌ల‌గ‌దు. చివ‌ర‌కు ఏం చేయాలో తెలియ‌క అలా కూర్చున్న ఒడ‌య‌నంబికి వివ‌స్త్ర‌గా ఉన్న వేశ్య క‌నిపిస్తుంది. దీంతో ఆమె స్త‌నాల‌ను ఒడ‌య‌నంబి చూస్తాడు. వాటినే శివ‌లింగంగా భావించి పూజ‌లు చేస్తాడు. రాత్రంతా జాగారం ఉండి, పూజ‌లు చేసిన ఒడ‌య‌నంబి చివ‌ర‌కు ప‌డిపోతాడు. దీంతో అత‌ని భ‌క్తికి మెచ్చిన శివుడు ప్ర‌త్యక్ష‌మై వ‌రం కోరుకోమ‌న‌గా, ఒడ‌య‌నంబి త‌న‌కు మోక్షం ప్ర‌సాదించ‌మ‌ని కోర‌తాడు. దీంతో శివుడు ఒడ‌య‌నంబితోపాటు ఆ వేశ్య‌కు కూడా మోక్షం ప్ర‌సాదిస్తాడు.

అయితే త‌రువాతి కాలంలో ఒడ‌య‌నంబి అలా పూజ చేసిన ప్రాంతంలో ఆల‌యం నిర్మాణ‌మ‌వుతుంది. అందులో స్త్రీ స్త‌నాల‌ను పోలిన లింగం ఉద్భ‌విస్తుంది. ఈ క్రమంలోనే ఈ ఆల‌యంలో శ్రీ‌రాముడు శివుడికి పూజ‌లు చేశాడని చెబుతారు. రావణాసురుడ్ని సంహరించిన రాముడు బ్రహ్మ హత్యా మహాపాతకాన్ని పోగొట్టుకునేందుకు పంచారామాలలో శివారాధన జరిపి, దండకారణ్య మార్గంలో వెళ్తూ మార్తాండపురం (ఆచంట) వస్తాడ‌ట‌. అలా వ‌చ్చిన రాముడికి అక్క‌డి ఆల‌యంలో పూజ చేయాల‌ని అనిపించి అత‌ను ఆ ఆల‌యంలో ఉన్న శివ‌లింగానికి అభిషేకం చేస్తాడ‌ట‌. దీంతో రాముడికి బ్ర‌హ్మ హ‌త్యా పాత‌కం పోతుంద‌ట‌. ఈ క్ర‌మంలో రాముడు శివుడికి పూజ‌లు చేశాడు క‌నుక ఈ ఆల‌యానికి రామేశ్వ‌రాల‌యం అని, అందులో కొలువైన శివుడికి రామేశ్వ‌ర స్వామి అని పేరు వ‌చ్చింద‌ని చెబుతారు.

ఇక ఆచంటలో స్త్రీ స్తనాల‌ను పోలిన‌ లింగం ఉద్భ‌వించ‌డంతో ఈ లింగానికి పూజ చేసే మహిళలపై స్వామివారి కృప అపారంగా ఉంటుందట. స్త్రీ వ్యాధులు, వివాహాలు, దాంపత్య సమస్యలు, సంతానలేమి వంటివాటితో బాధపడే మహిళలు ఇక్క‌డ పూజ‌లు చేస్తే ఆయా స‌మ‌స్య‌లు పోతాయ‌ని ఇక్క‌డి వారి న‌మ్మ‌కం. శివరాత్రి సమయంలో ఇక్కడ ఐదు రోజుల పాటు వేడుకలు జరుగుతాయి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top