కరివేపాకు గురించి మనందరికీ బాగా తెలుసు. కానీ అందులో ఔషద గుణాలే ఎవ్వరికీ తెలియదు. కరివేపాకులో కోహినిజెన్ అనే గ్లుకోజైడ్ ఉంటుంది. అందుకే దాని రుచి, సువాసన వేరేలా ఉంటుంది. కరివేపాకు చెట్టును మన ఇంట్లో పెంచుకుంటే ఒక మందుల షాప్ ను మనం ఉంచుకున్నట్లేనని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. మనమేమో కూరలో కరివేపాకు వస్తే ఎంచక్కా తీసి ప్లేటులో పక్కన పడేస్తాం. కాని రోజుకు 4 కరివేపాకు ఆకులు తిన్నా బాడీకి కలిగే ప్రయోజలను తెలిస్తే.. మీకు మీ శరీర ఆరోగ్యంపై ఏమాత్రం స్పృహ ఉన్నా వెంటనే తినడం స్టార్ట్ చేస్తారు. కరివేపాకు లో ఐరన్, కాల్షియం, ఫాస్పరస్, పిండి పదార్ధాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉన్నాయి. రోజూ నాలుగు కరివేపాకులు మనం తినే ఆహారంలో భాగంగా చేసుకుంటే ఎన్ని లాభాలో ఇప్పుడు చూద్దాం..
- పిల్లల ఎదుగుదలకు సహకరిస్తుంది. వారి ఎముకలకు బలాన్నిస్తుంది.
- కరివేపాకు కంటికి చాలా మంచిది. కంటి చూపు మెరుగు పరచడంలో, మెదడుని ఉత్తేజితం చేయడంలో, జ్ఞాపక శక్తి ని పెంచడంలో సమర్ధవంతంగా పనిచేస్తుంది.
- కరివేపాకు తినడం వల్ల మానసిక ఒత్తిడిని తగ్గించే రసాయనాల విడుదలకు దోహదం చేస్తుంది. తద్వారా మనల్ని యాక్టివ్ గా ఉంచుతుంది.
- ఎముకలు బలహీనంగా ఉన్నవారికి కరివేపాకు ఒక దివ్య ఔషదంగా పనిచేస్తుంది. ఇందులో కాల్షియం ఉండడం వల్ల ఎముకలను దృడంగా ఉంచుతుంది.
- వేవిల్లతో బాధపడుతున్న గర్భిణీలు కరివేపాకు రసంలో రెండు స్పూన్ల నిమ్మ రసం, కొద్దిగా తేనే కలిపి తాగితే వెంటనే వేవిళ్ళు తగ్గిపోతాయి.
- నోటిపూత తో బాధపడే ఆడవాళ్లు కొద్దిరోజుల పాటు రోజూ రెండు కరివేపాకు ఆకులు నమిలి మింగితే నోటి పూత తగ్గిపోతుంది.
- నరాల బలహీనత తో బాధపడేవారు ఇవి తింటే నరాలను గట్టి పరుస్తుంది.
- ఇక ఈ కరివేపాకును పరగడుపున నాలుగు ఆకులు నమిలి మింగితే షుగర్ వ్యాధి అంతమవుతుంది. ఇలాంటి శక్తి మన పెరట్లో పెరిగే
- కరివేపాకు ఉందని తెలియక చాలామంది షుగర్ రాగానే డాక్టర్స్ దగ్గరికి బయలుదేరుతారు.
- మనలో చాలా మంది కంప్యూటర్స్ ముందు పని చేస్తారు. అలా పనిచేసినప్పుడు కళ్ళు ఒత్తిళ్లకు గురువుతాయి. అలాంటి వారు ఇంటికి
- వెళ్ళగానే కరివేపాకు ఆకులు నీటిలోవేసి ఆ ఆకులను కంటిపై పెట్టుకుంటే ఆ ఒత్తిడి తగ్గి కంటిచూపు కూడా మెరుగుపడుతుందని వైద్య నిపుణులు చెబుతున్నారు.