No need to stand in the line for darshan in tirumala: తిరుపతిలో సాధారణ భక్తులు శ్రీవారిని దర్శించుకోవాలంటే కనీసం ౩ లేదా 4 గంటలైనా క్యూ లైన్ నిలబడాల్సిందే, అదే వారాంతాలలో, పండగల సమయంలో అయితే దాదాపు 10 గంటలకి పైనే క్యూ లైన్ లో వేచి చూడాల్సిందే, అలాగే వీఐపీ దర్శనాల వల్ల సాధారణ భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు, ఈ సమస్యని పరిష్కరించి సాధారణ భక్తులు క్యూ లైన్ లో నిలబడే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేసుకునేలా టైం స్లాట్ అనే పేరుతో ఒక కొత్త విధానాన్ని తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు చేపట్టబోతున్నారు.
No need to stand in the line for darshan in tirumala:
తిరుమలకి వచ్చే భక్తుల్లో దాదాపు 70 శాతం వరకు సర్వదర్శనం సమయంలోనే శ్రీవారిని దర్శించుకుంటారు, ప్రస్తుతం సోమవారం నుంచి గురువారం వరకు సర్వదర్శనానికి 5 నుంచి 6 గంటల సమయం పడుతోంది. శుక్ర, శని, ఆదివారాల్లో 8 గంటల సమయం పడుతుంది. వరుస సెలవుల రోజులు, ప్రత్యేక పర్వదినాల్లో 14 నుంచి 15గంటల పాటు క్యూలైన్లలోనే భక్తులు ఉండాల్సి వస్తోంది అని రద్దీ పెరిగే కొద్దీ సమయం పెరిగిపోతుందని ఈ సమయాన్ని తగ్గించడానికి టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ ఇతర అధికారులతో కలిసి ఈ కొత్త విధానాన్ని రూపొందించారు.
ఈ టైమ్ స్లాట్ విధానంలో తిరుమలలో 21 చోట్ల టైమ్ స్లాట్ కౌంటర్లు ఓపెన్ చేసి వాటి దగ్గరికి వెళ్లిన భక్తులకు ఎన్ని గంటలకు శ్రీవారి దర్శనానికి రావాలో సూచించే టోకెన్ లు ఇస్తారు, ఆ సమయానికి వచ్చి భక్తులు శ్రీవారిని క్యూ లైన్ లో వేచి చూడాల్సిన అవసరం లేకుండా నేరుగా దర్శనం చేసుకోవచ్చు, ఈ టైమ్ స్లాట్ కౌంటర్ లకి వెళ్లని భక్తులు ఇప్పుడు ఉన్నట్లుగానే క్యూ లైన్ వేచి చూస్తూ ఆ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవాల్సి ఉంటుంది. ఈ టైమ్ స్లాట్ విధానాన్ని డిసెంబర్ రెండో వారంలో ప్రయోగాత్మకంగా అమలు చేసి పరిశీలించనున్నారు..! చూద్దాం ఈ టైమ్ స్లాట్ విధానం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో..!