హర హర మహాదేవ.. శంభో శంకర.. అని తలచుకోగానే ముందుగా మనకు శివుడి రూపం కనిపిస్తుంది. జంతు చర్మాలను ధరించి, భంగు తాగుతున్న శివుడు, గంజాయి పొగ తాగుతున్న శివుడు మనకు సాక్షాత్కరిస్తాడు. అయితే దీన్ని బట్టి మనకు తెలుస్తుంది ఏమిటంటే.. గంజాయి ఇప్పటిది కాదు, ఎంతో పూర్వ కాలం నుంచి ఉన్నదేనన్న విషయం స్పష్టమవుతుంది. కానీ మీకు తెలుసా..? నిజానికి చెప్పాలంటే నాలుగు వేదాల్లో ఒకటైన అధర్వణ వేదం ప్రకారం.. గంజాయి మొక్క అనేది హిందువులకు ఓ పవిత్రమైన మొక్కనట. అవును, మీరు విన్నది నిజమే.
అయితే గంజాయి మొక్కకు శివుడికి సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా ? దాని వెనుక ఓ చిన్న కథ ఉంది. అదేమిటంటే.. ఓ రోజున శివుడు అడవిలో తిరిగి తిరిగి తీవ్రంగా అలసిపోయి ఓ చెట్టు కింద విశ్రమిస్తాడు. లేచే సరికి ఆయనకు బాగా ఆకలవుతుంది. దీంతో ఆకలిని తట్టుకోలేక ఆయన పక్కనే ఉన్న గంజాయి మొక్కను పీకి దానికి ఆకులను తింటాడు. ఆ ఆకులు ఆయనకు తాజాదనాన్ని, ఉత్సాహాన్ని అందిస్తాయి. దీంతో అప్పటి నుంచి గంజాయి మొక్క ఆయనకు ఇష్టమైంది.
అలా గంజాయి పొడిని కూడా శివుడు పొగ రూపంలో తాగడం మొదలు పెట్టాడు. ఇక శివునికి ఇష్టమైన పానీయం భంగు. దీన్ని సాధారణంగా హోలీ రోజు సేవిస్తారు. దీన్ని ఎలా తయారు చేస్తారంటే.. గంజాయి మొక్క ఆకులు,. పువ్వులను కలిపి తయారు చేస్తారు. ఇది కూడా శివుడికి ఇష్టమైన పానీయమే. ఎలా అంటే.. సముద్ర మథనం జరిగినప్పుడు పాల సముద్రం నుంచి ఉద్భవించే గరళం (విషం)ను శివుడు తాగుతాడు కదా. దీంతో లోకమంతా హమ్మయ్య అని ఊపిరి పీల్చుకుంటుంది. అయితే విషయం తాగిన శివుడిని శాంతింపజేసేందుకు దేవతలు ఆయనకు భంగు ఇచ్చారట. దీంతో భంగు తాగిన శివుడు శాంతిస్తాడట. అప్పటి నుంచి శివుడికి భంగు ఇష్టమైన పానీయం అయింది. కాగా ప్రతి ఏటా నేపాల్‌లోని ఖాట్మండులో ఉన్న పశుపతినాథ్ ఆలయంలో గంజాయి సేవించడం ఆనవాయితీగా వస్తున్నదట. ఇవీ… శివుడు గంజాయి పొగ, భంగు తాగడం వెనుక ఉన్న కారణాలు..!