2018 లో ఏ రాశి వారు ఏ నెలలో ఏ రోజు పెళ్లి చేసుకుంటే మంచిదో తెలుసా..? వివరాలు ఇవే.!





వ్యక్తులు పుట్టిన తేదీ, సమయాన్ని బట్టి వారు 12 రాశుల్లో ఏదైనా ఒక రాశికి చెందుతారని తెలిసిందే. ఆ రాశిని బట్టే వారి జాతకం ఉంటుంది. అదృష్టం కలసి వస్తుంది. దాని ప్రకారమే ఏ పని అయినా జరుగుతుంది. ఆఖరికి వివాహం అయినా సరే రాశి ప్రకారమే జరగాల్సిన సమయంలో జరగాల్సిన వ్యక్తులతో జరుగుతుంది. అయితే ఈ విషయానికి వస్తే 2018వ సంవత్సరంలో ఏ రాశి వారు ఏ నెలలో ఏ తేదీన వివాహం చేసుకుంటే శుభం కలుగుతుందో, వారి కాపురం సజావుగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం.

marriage rashi






1. మేష రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 27వ తేదీన వివాహం చేసుకోవాలి. దీంతో వీరి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. అలాగే వీరు అదృష్టవంతులుగా మారుతారు. కాపురంలో ఎలాంటి ఇబ్బందులు రావు.
2. వృషభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 7వ తేదీన వివాహం చేసే మంచి జరుగుతుంది. దీంతో వారి కాపురంలో ఎలాంటి సమస్యలు రావు.
3. మిథున రాశి
ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ఏ నెలలో అయినా 9వ తేదీన వివాహం చేసుకోవాలి. దీంతో వారి వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. అన్ని విషయాల్లో విజయం కలుగుతుంది.
4. కర్కాటక రాశి
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 15వ తేదీన పెళ్లి చేసుకోవాలి. ఇలా చేస్తే వీరు జీవితాంతం సుఖంగా ఉండవచ్చు. భార్యాభర్తల మధ్య ఎలాంటి తగాదాలు రావు.
zd 1

5. సింహ రాశి
వీరు ఏ నెలలో అయినా 3వ తేదీన వివాహం చేసుకుంటే దాంతో భార్యాభర్తల బంధం బాగా బలంగా ఉంటుంది. ఇద్దరూ కలివిడిగా ఉంటారు.
6. కన్యారాశి 
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 11వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది. మ్యారేజ్‌ లైఫ్‌ను ఎంజాయ్‌ చేస్తారు. భార్యాభర్తలు ప్రేమగా ఉంటారు. ఎలాంటి వివాదాలు రావు.
7. తుల రాశి 
ఈ రాశి వారు ఏ నెలలో అయినా 2వ తేదీన పెళ్లి చేసుకోవాలి. దీంతో వారి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. భార్యాభర్తలు హాయిగా కాపురం చేస్తారు. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి.
8. వృశ్చిక రాశి
వీరు ఏ నెలలో అయినా 18వ తేదీన పెళ్లి చేసుకుంటే దాంపత్య జీవితం బాగుంటుంది. భార్యాభర్తలు ఇద్దరూ ఎలాంటి కలహాలు లేకుండా కాపురం చేస్తారు.

9. ధనుస్సు రాశి 
వీరు ఏ నెలలో అయినా 21వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య సమస్యలు రావు. వైవాహిక జీవితం బాగుంటుంది.
10. మకర రాశి
వీరు ఏ నెలలో అయినా 30వ తేదీన పెళ్లి చేసుకుంటే జీవితాంతం వైవాహిక జీవితంలో ఎలాంటి సమస్యలు రాకుండా హాయిగా కాపురం చేస్తారు.
11. కుంభ రాశి
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 14వ తేదీన వివాహం చేసుకుంటే మంచి జరుగుతుంది. భార్యాభర్తల మధ్య బంధం మరింత బలపడుతుంది.
12. మీనం 
ఈ రాశి వారు ఈ సంవత్సరంలో ఏ నెలలో అయినా 20వ తేదీన పెళ్లి చేసుకుంటే మంచి జరుగుతుంది. భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారు. కలహాలు లేకుండా కాపురం చేస్తారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top