మనం సాధారణంగా వామును వంటలలో వాడుతూ ఉంటాం. వాము మొక్క మొత్తం మంచి సువాసన కలిగి ఉంటుంది. వాము మొక్క పువ్వులు గుత్తులు గుత్తులుగా ఉంటాయి. ఈ గుత్తులలోనే వాము గింజలు ఉంటాయి. వాము జీర్ణశక్తికి మంచిదని మన పెద్దవారు చెప్పటం కూడా మనం తరచుగా వింటూనే ఉంటాం. అలాంటి వాములో ఉన్న ఆరోగ్య ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.
*అజీర్ణంగా ఉన్నప్పుడు వాము, మిరియాలు, ఉప్పు సమాన భాగాలుగా తీసుకోని పొడి చేసుకొని భోజనానికి ముందు తింటే అజీర్ణం తగ్గుతుంది.