Tips to improve memory in children: పిల్లలు చురుగ్గా, చలాకీగా ఉండాలని అనుకుంటారు తల్లిదండ్రులు. ఆట పాటల్లోనూ, చదువులోనూ చురుగ్గా ఉండాలని కోరుకుంటారు. అయితే పెరుగుతున్న పోటీతో పిల్లలు ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది. దాంతో చదివినవి మర్చిపోతున్నామని చెప్తుంటారు. అయితే చిన్న చిన్న చిట్కాలతో మతిమరుపు సులువుగా అధిగమించవచ్చని నిపుణులు అంటున్నారు.
యాంటీ ఆక్సిడెంట్స్ మెండుగా ఉండే దానిమ్మరసం పిల్లల మెదడు పనితీరు మెరుగుపరుస్తుందని, అంతేకాక గుండెకు హానిచేసే ప్రీరాడికల్స్ నుండి దానిమ్మ కాపాడుతుందని వైద్యులు అంటున్నారు. అలాగే పిల్లలకు జలుబు చేస్తుందని…
చాలామంది పెద్దలు కొబ్బరినీళ్ళు తాగించరు. అయితే మెదడు పనితీరు పెంచే సూపర్ బ్రెయిన్ ఫుడ్స్ లో కొబ్బరి నీ ళ్ళుఒకటి. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత పెంచడంలో దీనికి మించింది లేదు. అంతేకాక పిల్లల్లో ఉద్రేకం, డిప్రెషన్ లక్షణాలను తగ్గించడంలో ముందుంటుంది. రక్తంలోని చక్కెరస్థాయిలను సమతుల్యం చేస్తుంది.
అధికమొత్తంలో నైట్రేట్లను కలిగివున్న బీట్రూట్ జ్యూస్ మతిమరుపుకు సంజీవని లాంటిది….ఇది రక్తనాళాలను శుభ్రపరిచి, మెదడు పనితీరును చురుగ్గా మారుస్తుంది. పిల్లల్లో ఏర్పడే డెమెన్షియా వ్యాధి రాకుండా కాపాడుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. కాబట్టి దానిమ్మ, కొబ్బరినీళ్లు, బీట్రూట్ మీ పిల్లల డైట్లో ఉండేటట్టు చూసుకోండి. ఇక మీ పిల్లలు సూపర్ కిడ్స్ అవ్వడం ఖాయం.
Tips to improve memory in children (Video)