పండ్లు , కాయగూరలు ,గింజలు, పప్పులు , కందమూలాలు ,సుగంధద్రవ్యాలు మానవుడికి ప్రక్రుతి ప్రసాదించిన అపురూపమైన వరము .ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలు గా తెలుసును . అన్నం తో కూడా ప్రకృతిసిద్ధమైన పండ్లు , కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారం గా ఆహారముగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి.
ఇదే అసలు ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం…..ఆహారం జీవం ఉన్న ప్రతి జీవికి అత్యవసరమైనది. పిండిపదార్ధాలు, మాంసకృత్తులు, కొవ్వుపదార్ధాలు, ఖనిజలవణాలు, పీచుపదార్ధాలు, రోగనిరోధక శక్తికి కావలసిన విటమిన్లు మరియు శరీర పోషణకు రక్షణకు కావలసిన పదార్ధాలను కలిగిన పదార్దాలను ఆహారంగా పేర్కొనవచ్చు. ఇవి కాక శరీరానికి నూతన ఉత్సాహాన్నిచ్చే కాఫీ, టీ లాంటి వాటిని కూడా ఆహారపదార్ధాల కోవలోకి వస్తాయి. ఆహారం ఘన, ద్రవ రూపాలలో లభ్యం అవుతుంది.చాలామంది ఆరోగ్యము పట్ల జాగ్రత్త వహించేవారు సైతము గింజలు తినడము పట్ల పెద్దగా దృష్టి సారించరు… కాని ఇవి ఆరోగ్యానికి ఎంతో ఉపయుక్తమైనవి.ప్రపంచంలో చాలా మంది అనేక రోగాల భారిన పది చనిపోతున్నారు. చనిపోతున్న వారిలో ఎక్కువ శాతం గుండెజబ్బులతో చనిపోతుంటే మిగిలినవారు డయాబెటిస్, క్యాన్సర్ల తో చనిపోతున్నారు. గుండె జబ్బుల విషయంలో ప్రపంచ వ్యాప్తంగా అనేక పరిశోధనలు చేసిన శాస్త్రవేత్తలు అధిక కొవ్వు శరీరంలో పేరుకుని పోవడం తద్వారా ఆ కొవ్వు గుండెకి పాకి చివరికి ప్రాణాపాయ స్థితికి రావడం జరుగుతోందని గుర్తించారు.
మనిషి శరీరంలో అధిక శాతంలో ఉండే కొవ్వుని కరిగించడానికి ఉపయోగపడే ఒకే ఒక్క మందు “అవిస గింజలు” అని ప్రపంచంలో ఈ అవిసగింజలు తప్ప వేరే ఏ మందు అయినా సరే బాడీ లోని కొలిస్త్రాల్ ని తగ్గించడంలో 100 శాతం సక్సెస్ అవ్వలేకపోయాని వైద్య నిపుణులు చెప్తున్నారు.
శరీరంలో అధిక కొవ్వుతో లావుగా అయ్యి భాదపడేవాళ్ళు కానీ , గుండెల్లో కొవ్వు పెరిగి హార్ట్ ఎన్లార్జ్ తో భాదపడే వాళ్ళు. ప్రతీరోజు రాత్రి పూట ఒక చెంచాడు అవిసగింజలు ఒక గ్లాసులో నానబెట్టుకుని ఉదయం నీళ్ళని తీసివేసి వాటిని తినడం వలన గింజలో కొవ్వుని కరిగించే పోషకాలు శరీరంలో కి చేరి కొవ్వుని కరిగిస్తుందని శాస్త్రవేత్తలు గుర్తించారు.
అంతేకాదు బీపిని నియంత్రించడంలో కూడా అవిసగింజలు ఉపయోగపడతాయని వైద్యులు చెప్తున్నారు. ప్రపంచంలోనే ఈ అవిసగింజలు అధిక కొవ్వుని కరిగించడంలో ముఖ్యమైన మెడిసిన్ అని గుర్తించిన శాస్త్రవేత్తలు.మన ఇండియా నుండి వీటిని అధిక మొత్తంలో మందుల తయారికి ఎగుమతి చేసుకుంటున్నారు.